Enter
The World of Luxury Living. Starting at Rs 2.3 Cr!
హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రెబల్' చిత్రం ఇటీవల విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పోటీగా పెద్ద కమర్షియల్ సినిమాలు ఏమీ లేక పోవడం వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపిస్తోంది. ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీసు కలెక్షన్లు కూడా ఆశా జనకంగానే ఉన్నాయి.
యూఎస్ బాక్సాఫీసు రిపోర్టు ప్రకారం ఈచిత్రం గడిచిన వీకెండ్‌లో మంచి ఓపెనింగ్స్ సాధించింది. అయితే లిమిటెడ్ స్క్రీన్లలో విడుదల కావడంతో మీడియం బడ్జెట్ సినిమాలైన సుడిగాడు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రాలను కలెక్షన్ల పరంగా అధిగమించ లేక పోయింది.
రెబల్
చిత్రం ఇక్కడ సెప్టెంబర్ 28న 56 స్క్రీన్లలో విడుదలైంది. లారెన్స్ దర్శకత్వంలో ప్రభాస్,
తమన్నా, దీక్షా సేథ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈచిత్రం ఫస్ట్ వీకెండ్ లో దాదాపు రూ. 50 లక్షలు వసూలు చేసింది. బాలీవుడ్ ట్రేడ్ అనాలసిస్ట్ చెప్పిన వివరాల ప్రకారం ఈ చిత్రం యావరేజ్‌గా ఒక్కో స్క్రీన్‌కు $1,662 వసూలు చేసింది.
0 comments:
Post a Comment